విశాఖపట్టణం,మార్చి2(జనంసాక్షి): విశాఖ నగరాభివృద్ధి, పారిశ్రామిక, పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతిపాదించిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ జిల్లా అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన దిశానిర్దేశం చేశారు. దీంతో జిల్లా కెలక్టర్ యువరాజ్ వివిధ పనుల పురోగతిని ,వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై సవిూక్షించారు. బేపార్కు, మూన్‌ల్యాండ్ ¬టళ్ల నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. తొట్లకొండ, బావికొండ బౌద్ధ క్షేత్రాలను పర్యాటకులను ఆకట్టుకొనేలా తీర్చిదిద్దాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న భూముల వివరాలను తెలిపారు. ఐటీ పార్కు ఏర్పాటులో భాగంగా లక్ష చదరపు అడుగుల స్థలంలో రూ. 25 కోట్ల ఖర్చుతో పనులు చేపట్టామని, వుడా, సాప్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయని, టెండర్ల దశలో ఇది ఉందని చెప్పారు. రవీంద్రభారతి తరహాలో ఎం.వి.పి.కాలనీలో ఆడిటోరియం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఎంజీఎం పార్కులో వినోద పార్కు కోసం 7.5 ఎకరాలు సిద్ధం చేశామని చెప్పారు.




