Tuesday, 3 November 2026

తాగునీటి సమస్య పరిష్కారం కోసం గిరిజన విద్యార్థి సమాఖ్య దీక్ష

అనంతపురం : రాయలసీమలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో గిరిజన విద్యార్థి సమాఖ్య నిరవధిక దీక్ష చేపట్టింది. జీవీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట 48 గంటల నిరవధిక దీక్ష ప్రారంభమైంది. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తూ తాగునీరు అందించాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. రాయలసీమ ప్రాంతానికి చెందినవారే సీఎంలు అవుతున్నా.. సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదని శంకర్‌నాయక్‌ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *