వేంపల్లి (కడప) : వేంపల్లిలోని తెదేపా ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డికి చెందిన అరటితోట సోమవారం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో రూ. 10 లక్షల ఆస్తినష్టం జరిగింది. రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో ఎమ్మెల్సీ 15 ఎకరాల్లో అరటి తోట సాగుచేశారు. ఈ ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగి నాలుగు ఎకరాల తోట దగ్ధమైంది. అకతాయిలు వేసిన సిగరెట్టుతో తోటకు నిప్పంటుకున్నట్లు సమాచారం.




