గుంటూరు : పెద్దకాకాని వద్ద జాతీయ రహదారిపై ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యం సేవించిన అతను తన వాహనంతో ఇతర వాహనాలను ఢీకొడుతూ రోడ్డుపై బీభత్సం చేశాడు. ఆ తాగుబోతును వెంబడించి పట్టుకున్న వీరారెడ్డి అనే కానిస్టేబుల్‌ను చితకబాదాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.




