తిరుపతి: పంచాయతీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సులో పాల్గొనడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. గురువారం విజయవాడలో రెండో ప్రాంతీయ సదస్సు ముగించుకొని నేరుగా రైల్లో తిరుపతికి చేరు కున్నారు. శుక్రవారం మూడో ప్రాంతీయ సదస్సు ఉదయం 10గం.లకు తిరుచానూరు రహదారిలోని రామానాయుడు కల్యాణ మండపంలో జరగునుంది. ఈ సదస్సుకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల కార్యకర్తలు పాల్గొననున్నారు.




