తిరుపతిలో టాస్క్‌ఫోర్స్‌ సీఐపై దుండగుల దాడి

తిరుపతి, : తిరుపతిలో టాస్క్‌ఫోర్స్‌ సీఐ అశోక్‌పై గుర్తుతెలియని దుండుగులు దాడి చేశారు. పద్మావతిపురం సమీపంలో సీఐ అశోక్‌ కళ్లల్లో కారం చల్లి దాడి చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధించే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో సీఐగా పనిచేస్తున్న అశోక్‌ గతంలో శేషాచలం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. గాయపడిని సీఐను ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

తాజావార్తలు