Thursday, 5 November 2026

తిరుపతి మార్కెట్‌ సవిూపంలో యువకుడి హత్య

తిరుపతి,మార్చి26  (జ‌నంసాక్షి) : తిరుపతి మున్సిపల్‌ మార్కెట్‌ సవిూపంలో యువకుడు హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణెళి హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు పాపానాయుడు పేటకు చెందిన కుమార్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవాన్ని పోస్ట్మార్టమ్‌కు పంపారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య ఎవరు చేశారన్నది ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *