చిత్తూరు,మార్చి26 (జనంసాక్షి) : శేషాచల అటవీప్రాంతంలో మరోమారు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఇటీవల మరోమారు ఎర్రదొంగలు విజృంభించడంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. శ్రీవారిమెట్టు మార్గంలోని ఆంజనేయస్వామి దేవాలయానికి పడమర దిశలోని అడవిలో ఈతగుంట, గుర్రాలబావి మార్గాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏడుగురు ఎర్రదొంగలు ఎర్రచందనం దుంగలను మోసుకు వస్తుండగా అటవీఅధికారులు వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. అటవీశాఖ, 9వ బెటాలియన్, బేస్‌క్యాంప్ బలగాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో శేషాచల అడవి దిగువభాగాన ఈతగుంట, గుర్రాలబావి విూదుగా ఏడుగురు ఎర్రదొంగలు ఎర్రచందనం దుంగలను మోసుకు వస్తుండగా అటవీఅధికారులు చుట్టుముట్టారు. దీంతో తమిళనాడుకు చెందిన ఆరుగురు, చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లికి చెందిన ఓ యువకుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు తప్పించుకె’ళ్లాడని అధికారులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులతో పాటు ఎర్రచందనం దుంగలు, నిత్యావసరాలను రంగంపేటలోని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. నిందితుల నుంచి 11 ఎర్రచందనం దుంగలు, నిత్యావసర వస్తువులు, కూరగాయలను స్వాధీనం చేసుకున్నామని, పారిపోయిన చిరంజీవిని తొందరలోనే అదుపులోకి తీసుకుంటామని అధికారులు వివరించారు.




