Tuesday, 3 November 2026

తిరుమలలో ప్రేమజంట ఆత్మహత్య

తిరుమలలో దారుణం జరిగింది. తమిళనాడు కొయంబత్తూర్ కు చెందిన ప్రేమజంట తిరుమల కొండపైన రామ్ బగీచ గెస్ట్ హౌస్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మూడు రోజుల క్రితం తిరుమలకు వచ్చిన వీరు రామ్ బగీచ విశ్రాంతి గదిలో ఉంటున్నారు. ఇవ్వాళ రూం శుభ్రపరచడానికి గది తలుపులు తీయగా వీరు ఫ్యాన్ కు ఉరివేసుకుని ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *