Tuesday, 3 November 2026

దంపతుల ఆత్మహత్య

పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాము(32) భార్య సునీత(23) కుటుంబ కలహాల కారణంగా ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకున్నారు. రాము తన ఇంట్లో ఉరేసుకోగా.. అనంతరం సునీత చెరువు కట్ట వద్ద ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది.స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *