Tuesday, 3 November 2026

దొంగల దాడిలో వృద్ధురాలి మృతి!

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి అభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన స్థానిక చావలి వారి వీధిలో రాత్రి11 గంటల సమయంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఎలవర్తి కమలమ్మ అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో దోపిడీ దొంగలు లోనికి ప్రవేశించారు. ఆమెను బెదిరించి, గొంతు నులిమి నగలు దోచుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా… అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

అయితే దీనిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగలు గొంతు నులమడంతో ఆమె మృతిచెందిందా? లేదా దొంగలు దాడి చేసిన క్రమంలో గట్టిగా అరవడంతో ఆమె గుండె ఆగిపోయిందా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *