Tuesday, 3 November 2026

దొంగ ఓట్లను తొలగించాలని తిరుపతిలో భారీ ధర్నా

తిరుపతి: దొంగ ఓట్లను తొలగించాలని కోరుతూ తెలుగు యువత తిరుపతిలో భారీ ధర్నా చేపట్టింది. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నేతలు బైఠాయించి నిరసన చేపట్టారు. తిరుపతి నగరంలోని 50 డివిజన్లలో 40 వేల వరకూ దొంగ ఓట్లను గుర్తించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌, వైకాపాలు తమకు అనుకూలమైన వారిని దొంగ ఓట్లుగా చేర్చారని ఆరోపించారు. దొంగ ఓట్లను తొలగించే వరకూ అందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *