సబ్బవరం: విశాఖ జిల్లా సబ్బవరం ఎన్టీఆర్ కూడలి వద్ద అనకాపల్లి `అనందపురం రహదారిపై ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పెదనాయుపాలెం గ్రామానికి చెందిన పోతల సత్యనారాయణ (21) అక్కడికక్కడే మృతి చెందాడు. పాతవలసకు చెందిన తోట రవితేజకు కాలు విరిగింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు.




