Wednesday, 4 November 2026

నందిపాడు కేజీబీవీలో ఆకలి కేకలు

నెల్లూరు, మార్చి 22 : దుత్తలూరు మండలం నందిపాడులోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలను అధికారులు గాలికొదిలేసి పత్తాలేకుండా పోవడంతో విద్యార్థినులు ఆకలితో అలమటిస్తున్నారు. ఉదయం నుంచి టిఫిన్‌ కానీ నీళ్లిచ్చే దిక్కుకానీ లేకపోవడంతో తట్టుకోలేక టిఫిన్‌ చేసేందుకు ఒక్కసారిగా వారంతా గ్రామంలోకి వచ్చారు. దీంతో విషయం బయటకు వచ్చింది. ఆకలితో అలమటిస్తూ విద్యార్థులు పడుతున్న బాధను చూసిన గ్రామస్తులు మీడియాకు సమాచారం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *