బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి వద్ద ఉన్న కేఎస్‌ఎస్ జ్యూస్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు రూ. 2కోట్ల విలువైన మామిడికాయలు, వాటిని నిల్వ ఉంచిన షెడ్లు కాలిపోయాయి. చిత్తూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పుతున్నారు. ప్రమాద కారణాలు తెలవాల్సి ఉంది.




