ఒంగోలు,మార్చి9 : ప్రకాశం జిల్లా కలెక్టర్ నలుగురు రెవెన్యూ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. పట్టాదారు పాస్‌పుస్తకాల అక్రమ జారీ వ్యవహారంలో వారిని సస్పెండ్ చేశారు. కొనకనమిట్ల తహసీల్దార్ చంద్రావతి, ఆర్‌ఐ షవిూ ఉల్లా, వీఆర్వో చలమారెడ్డి, సర్వేయర్ శ్రీనులను కలెక్టర్ సోమవారం సస్పెండ్ చేశారు. వీరు అక్రమంగా పట్టాదారు పుస్తకాలు ఇచ్‌ఇచనట్లు గుర్తించారు. విచారణలో విషయం తేలడంతో కలెక్టర్ సస్పెనషన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదిలావుంటే అద్దంకి మండలంలోని చక్రాయపాలెం గుండ్లకమ్మ ఇసుకరీచ్‌లో ఇసుక అమ్మకం కేంద్రాన్ని జిల్లా గ్రావిూణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు ఎంఎస్ మురళి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు అశోక్ వర్థన్, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ శ్యామల, ఏపీఎం సైమన్, సర్పంచి మల్లిపెద్ది అంజని, డ్వాక్రా సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.




