పిఠాపురం: ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలం పని చేయడంతో తనకు ప్రత్యేక అనుభవం వచ్చిందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో పరిశోధన చేసిన కేసుల్లో ఏన్నో కోత్త విషయాలు తెలుసుకున్నానని అయన తెలిపారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం, పిఠాపురం, సామర్లకోట క్ష్రేత్రాలను ఆయన కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ తన బదిలీసాధారణంగా జరిగిందేనని అన్నారు. తాను ఇక్కడ ఎక్కువ కాలం పని చేయడం వల్ల కేసులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఎక్కువగా ఒకే చోట ఉండటం వల్ల పిల్ల్లల చదువులకు ఆటంకం కలగలేదన్నారు. ఈ నెల 11న బాధ్యతలను తల స్థానంలో వస్తున్న మరో అధికారికి అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు అందాయన్నారు. అయితే మహారాష్ట్రకు బదిలీ అయినట్లుగా ప్రచారం జరుగుతుందే తప్ప ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఉత్తర్వులు రాలేతన్నారు. వివేకానందుడు చెప్పినట్లు దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని ఆయన పేర్కోన్నారు.




