Friday, 6 November 2026

నెల్లూరు జిల్లాలో న్యాయవాదుల ఆందోళన

నెల్లూరు: అలహాబాద్‌లో ఓ న్యాయవాదిని కానిస్టేబుల్‌ కాల్చిచంపిన సంఘటనకు నిరసనగా నెల్లూరు జిల్లాలో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి, ఆందోళన చేపట్టారు. నెల్లూరు జిల్లా కోర్టు ఎదుట విధులు బహిష్కరించిన న్యాయవాదులు గంటసేపు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో గంటసేపు కోర్టు మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. నెల్లూరుతోపాటు కోపూరు, ఆత్మకూరు, గూడూరు, కావలి, వెంకటగిరి, ఉదయగిరి ప్రాంతాల్లోని కోర్టులను న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు కొనసాగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *