నెల్లూరు: బస్సు సర్వీసు రద్దు.. ప్రయాణికుల అవస్ధలు

వరికుంటపాడు: మండల పరిఽధిలోని గువ్వాడి మీదుగా పామూరు వెళ్లే నైటౌట్‌ తెలుగు వెలుగు బస్సు సర్వీసును అధికారులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. రెండు రోజులుగా ఆ బస్సును రద్దు చేయడంతో వరికుంటపాడు, ఉదయగిరి మండలాలకు చెందిన ప్రజలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు నానా ఇబ్బందులు గురవుతున్నారు. మారుమూల గ్రావల్లో తిరుగుతున్న ఆ బస్సును అధికారులు ఆదాయమే ధ్యేయంగా కాకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రతి రోజు కొనసాగించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

తాజావార్తలు