Tuesday, 3 November 2026

నేటి నుంచి ఇక భూసేకరణ : నారాయణ

విజయవాడ,ఫిబ్రవరి28 : ఆంధప్రదేశ్‌ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకూ 27 వేల ఎకరాల భూమిని సవిూకరించడం జరిగిందని ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు. ఇంకా ఆరువేల ఎకరాలు సవిూకరించాల్సి ఉందని, శనివారం రాత్రి వరకూ భూసవిూకరణ చేస్తామని తెలిపారు. శనివారం మంగళగిరి, నిడమర్రు, బేతపూడి గ్రామాల్లో పర్యటించిన మంత్రి నారాయణ విూడియాతో మాట్లాడారు. ఆదివారం నుంచి భూ సేకరణ చేపడతామని ప్రకటించారు. తుళ్లూరు కేంద్రంగా ఆదివారం నుంచి సీఆర్‌డీఏ కార్యకలాపాలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు. రాజధాని ప్రాంతంలో 30 కోళ్ల ఫారాలు గుర్తించామని, వారికి పరిహారం విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ హావిూ ఇచ్చారు. కాగా, ఏపీ నూతన రాజధాని భూసవిూకరణ గడువు నేటితో ముగియనుంది. చివరి రోజు రైతుల నుంచి సమ్మతి పత్రాలు స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి వరకైనా రైతుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకునేలా చర్యలు చేపట్టారు. భూ సవిూకరణ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గ్రామాల్లో సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *