కాకినాడ,మార్చి9(జనంసాక్షి): కాకినాడలోని కలెక్టరేట్‌లో వికాస వద్ద ఈనెల 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పీడీ వి.ఎన్.రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని కోవెలంట్ ల్యాబ్స్‌లో ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారన్నారు. పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన 30 ఏళ్ల లోపు పురుష అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మంగళవారం ఉదయం 9 గంటలకు వికాస వద్ద విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని కోరారు.




