గుంటూరు,మార్చి9(జనంసాక్షి): రాజధాని నిర్మాణంలో జగన్ సహకరించకుండా అడ్డుపడుతూ రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలుచేయడం తగదని టిడిపి నేతలు అన్నారు. మనకు ఓ అద్భుతమైన రాజధాని కావాలని కోరుకోవాల్సి ఉందన్నారు. ఎందరు అడ్డువచ్చినా ప్రజా రాజధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్మించి తీరుతామని గుంటూరు టిడిపి నాయకులు ప్రకటించారు. రాష్ట్రంలో టిడిపి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తోందనే విషయాన్ని ఇప్టి వరకు చేపట్టిన పనులే నిదర్శనమన్నారు. జగన్‌కు దిక్కుతోచని పరిస్థితిలో ఇక్కడికి వచ్చి రైతులను రెచ్చగొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. వైకాపా పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని గ్రహించాలని అన్నారు. నేను ముఖ్యమంత్రినైతే భూములు తిరిగి ఇస్తానంటున్న జగన్ ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారని, 12 కేసుల్లో ఏ1 నిందితునిగా ఉండి, రాష్ట్ర సంపదను భారీగా దోచుకున్న ఆయనకు ప్రజలు అధికారం ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు.




