Wednesday, 4 November 2026

నేనేతప్పూ చేయలేదు

శ్రీనివాసస్‌

ముంబయి : స్పాట్‌ ఫిక్సింగ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసస్‌ వట్టకేలకు స్పందించారు. తన అధ్యక్ష పదవి రాజీనామాపై వస్తున్న డిమాండ్లను ఆయన తిరస్కరించారు. స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌  కేసులో శ్రీనివాసస్‌ అల్లుడు గురునాథ్‌ మయ్యప్పన్‌ అరెస్టవడంతో శ్రీనివాసస్‌ రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆయన ముంబయిలో విలేకరులతో మాట్లాడారు. తానేతప్పూ చేయలేదని, బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశారు. కొంతమంది తనపై ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీసీసీఐ కఠిన నిబంధనలను అనుసరిస్తుందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *