Wednesday, 4 November 2026

నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తే గౌరవంగా ఉండేది

భజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు

గాంధీనగర్‌ (కాకినాడ) : అప్రతిష్ఠ మూటగట్టుకున్న తరువాత కేంద్ర మంత్రి పదవులకు పవన్‌కుమార్‌ బన్సల్‌, అశ్వనీకుమార్‌లు రాజీనామా చేశారని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. అరోపణలు వచ్చిన వెంటనే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తే గౌరవంగా ఉండేదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వంపైనా రాని అరోపణలు అవినీతి కుంభకోణాలు యూపీఏపైనే వస్తున్నాయని ఆయన అన్నారు. ఈఈ కుంభకోణాలు కాగ్‌, సీవీసీ నివేదికలు, కోర్టుల జోక్యంతో బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు. 2జీ, కామన్వెల్త్‌, బొగ్గు కుంభకోణాల్లో అరోపణలు వచ్చినపుడు సంబంధిత మంత్రులను ప్రధాని వెనకేసుకు రావడం దురదృష్టకరమన్నారు. కేంద్రం సీబీఐని ప్రతిపక్షాలను అప్రతిష్ఠపాలు జేయడానికి, విపక్షాలను అదుపులో ఉంచేందుకు వాడుకుంటోందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అంపశయ్యపై ఉందని ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో వారికే తెలియదని అభిప్రాయపడ్డారు. యూపీఏ అవినీతిపై ఈనెల 12నుంచి భాజపా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కర్ణాటక ఎన్నికల్లో భాజపా పరాభవం పార్టీ స్వయంకృతాపరాధమేనని వ్యాఖానించారు. మోడీ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడని వెంకయ్యనాయుడు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *