Tuesday, 3 November 2026

పంతం నెగ్గించుకున్న ప్రేమికురాలు

తాళ్ళపూడి : ఇరువర్గాల కుటుంబసభ్యుల ఘర్షణలు, పోలీస్‌, సోషల్‌ యాక్షన్‌ కమిటీ బృందం చొరవతో ప్రేమికుల జంట కఽథ సుఖాంతమైంది. పైడిమెట్ట గ్రామానికి చెందిన యువతి సుబ్బలక్ష్మి, వేగేశ్వరపురం గ్రామానికి చెందిన రవికుమార్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్ళి మాట ఎత్తేసరికి రవికుమార్‌ వ్యతిరేకించడంతో ఇరు కుటుబసభ్యుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. విషయం పోలీసు స్టేషన్‌కు, సోషల్‌ యాక్షన్‌ కమిటీ బృందానికి చేరింది. ఎస్‌ఐ జె.సతీష్‌, కమిటీ బృందం నేతృత్వంలో ఇరు కుటుంబసభ్యులతో మగళవారం చర్చలు జరిపారు. పైడిమెట్ట చర్చిలో వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా రవికుమార్‌ తల్లి పెళ్లి జరిపిస్తే పురుగులమందు తాగుతానని బెదిరింపులకు పాల్పడింది. మండల మాజీ సమాఖ్య అధ్యక్షురాలు భీష్మాంబ మాట్లాడుతూ సమస్యను జిల్లా ఎస్‌పి భాస్కర్‌భూషణ్‌ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. ఆయన ఆదేశాల మేరకు వివాహం జరిపించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *