Thursday, 5 November 2026

సేంద్రియ సాగుకు ముందుకు రావాలి

ఏలూరు,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి)
: జిల్లాలో 120 హెక్టార్లో వరి, వంద హెక్టార్లో ఉద్యాన పంటలు సేంద్రియ ఎరువుల పద్ధతిలో సాగులో ఉన్నాయని ఏలూరు రైతు శిక్షణ శాఖ అధికారులు అన్నారు. మెట్టప్రాంత పొలాలకు సేంద్రియసాగుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, రైతుల్లో అవగాహన ఇపుడిపుడే కలుగుతోందని చెప్పారు. సాంద్ర వ్యవసాయం నుంచి గోఆధారిత సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపుతున్నారని అన్నారు.  గోఆధారిత వ్యవసాయంపై గౌతమి సేవా సమితి ఆధ్వర్యంలో నాచుగుంట గోవ్యవసాయ క్షేత్రంలో ఒక రోజు శిక్షణ, అవగాహన సదస్సును నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన సేంద్రియ సాగుదారులు, ఔత్సాహిక రైతులు పాల్గొన్నారు.  తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చన్నారు. పర్యావరణానికి, సమాజానికి ఎంతో శుభప్రదమైన గోఆధారిత వ్యవసాయంపై రైతులు మరింత ముందుకు రావాలని కోరారు. ఒక ఆవుతో నాలుగు ఎకరాల్లో సేంద్రీయ ఎరువులతో సాగుచేయవచ్చన్నారు. నాచుగుంట గోవ్యవసాయ క్షేత్రంలో సాగుచేస్తున్న వరి, అరటి, అపరాలు, ఉల్లి, చెరకు పంటలను రైతులు సందర్శించారు. తక్కువ ఖర్చుతో మేలైన ఆహార ఉత్పత్తులు ఎలా పండించవచ్చో స్వయంగా చూసి ఎంతో నేర్చుకున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. నాచుగుంట గోవ్యవసాయ క్షేత్రం నమూనా కేంద్రమని రైతులు అభివర్ణించారు. సేంద్రియసాగు విధానాన్ని, సాధించిన లక్ష్యాలను రైతులు తెలియజేశారు. ఇలాంటి క్షేత్రాలను అభివృద్ది చేయాల్సి ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *