తిరుపతి,మార్చి9(జనంసాక్షి): ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీ ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు తిరుపతి పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థ్‌జైన్ పేర్కొన్నారు. కమిటీ సభ్యులకు ఏర్పాట్లపై అధికారులతో సవిూక్షించారు. కమిటీ చైర్మన్ జ్టసిస్ సి.కె.ప్రసాద్, కమిటీ సభ్యలు జిల్లాలకు రానున్నారు. పద్మావతి అతిథి గృహంలో వసతి, ఎస్వీ యూనివర్శిటీ సెనేట్ హాలులో కమిటీ సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. వీటికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సభ్యుల రిసెప్షన్ పనులు చూడాలని సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయలక్ష్మిని ఆదేశించారు.




