Tuesday, 3 November 2026

పరీక్షకు వెళ్తూ విద్యార్థి మృతి

సి.బెళగల్: కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఇనగండ్ల సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఇనగండ్ల గ్రామానికి చెందిన బి.సురేష్ మండల కేంద్రమైన సి.బెళగల్‌లో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు ఇసుక ట్రాక్టర్ ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ట్రాక్టర్ పైనుంచి జారి వెనుక చక్రం కింద పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *