విజయవాడ : ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆలోచించండి.. తినండి.. కాపాడండి…అనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పిన్నమనేని పాలీక్లినిక్ రహదారిలోని కిమ్స్ అసుపత్రి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ ఉషాకుమారి పచ్చజెండా వూపి ప్రారంభించారు. ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి తిండి దొరకడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.




