Tuesday, 3 November 2026

‘పశ్చిమ’లో భారీ వర్షం

ఏలూరు, జూలై 19 : పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో 7.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళికా శాఖ జాయింట్‌ డైరెక్టరు శ్రీ కె. సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఉంగుటూరు మండలంలో 34.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కాగా జీలుగుమిలిల్లో 4.4, బుట్టాయిగూడెంలో 2.8, పోలవరంలో 10, తాళ్ళపూడిలో 4.2, గోపాలపురంలో 8.7, కొయ్యలగూడెంలో 2.4, జంగారెడ్డి గూడెంలో 1.8, చింతలపూడిలో 9, లింగపాలెంలో 12.4, కామవరపుకొటలో 11.8, ద్వారకాతిరుమలలో 2, నల్లజర్లలో 2.2, కొవ్వూరులో 3.6, నిడదవోలులో 1.4, తాడేపల్లిగూడెంలో 16.4, భీమఢోలులో 9.8, పెదవేగిలో 7.8, పెదపాడులో 9.4, ఏలూరులో 1.4, దెందులూరులో 6.2, నిడమర్రులో 12.6, గణపరంలో 13.6, పెంటపాడులో 29, తణుకులో 19.4, ఉండ్రాజవరంలో 5.8, పెరవలిలో 11.4, ఇరగవరంలో 10.2, అత్తిలిలో 12, ఉండిలో 1.2, కాళ్లలో 0.4, పాలకోడేరులో 2.4, పెనుమంట్రలో 11, పెనుగొండలో 7.6, ఆచంటలో 7.2, పోడూరులో 14, పాలకొల్లు మండలంలో 3.4 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *