పశ్చిమ డెల్టాకు నీటి విడుదల
దుగ్గిరాల: కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 1016 క్యూసెక్కుల నీటిని శుక్రవారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజివద్ద నీటిమట్టం 10.5 అడుగులున్నట్లు తెలిపారు. దుగ్గిరాల సబ్‌డివిజన్ నుంచి కొమ్మమూరు కాల్వకు 537 క్యూసెక్కులనీరు, రేపల్లెకాల్వకు 264 క్యూసెక్కులనీరు, తూర్పుకాల్వకు 187 క్యూసెక్కులనీరు, పశ్చిమకాల్వకు 122 క్యూసెక్కులనీరు, నిజాంపట్నంకాల్వకు 251 క్యూసెక్కులనీరు విడుదల చేశారు.