Tuesday, 3 November 2026

పశ్చిమ డెల్టాకు 2719 క్యూసెక్కుల నీటి విడుదల

కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 2719 క్యూసెక్కుల నీటిని మంగళవారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజివద్ద నీటిమట్టం 10.6 అడుగులున్నట్లు తెలిపారు. దుగ్గిరాల సబ్‌డివిజన్‌ నుంచి కొమ్మమూరు కాల్వకు 1110 క్యూసెక్కులనీరు, రేపల్లెకాల్వకు 507 క్యూసెక్కులనీరు, తూర్పుకాల్వకు 266 క్యూసెక్కులనీరు, పశ్చిమకాల్వకు 209 క్యూసెక్కులనీరు, నిజాంపట్నంకాల్వకు 344 క్యూసెక్కులనీరు, హైలెవెల్‌ఛానల్‌కు 90 క్యూసెక్కులనీరు విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *