Wednesday, 4 November 2026

25న వ్యాపార సంస్థలకు సెలవు

గుంటూరు: బక్రీదు పర్వదినం సందర్భంగా ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేయాల్సిందిగా సంయుక్త కార్మిక కమిషనర్‌ ఎం.ఎస్‌.వరహాలరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత 24న బక్రీదు సెలవు దినంగా ప్రకటించామని అయితే ప్రభుత్వం 25న సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని వ్యాపార సంస్థలు, దుకాణాలను ముందుగా ప్రకటించినట్లు కాకుండా 25న ముసివేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించి ఆయా దుకాణాలను తెరిస్తే కార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *