Tuesday, 3 November 2026

పసిడి ధరల్లో తీవ్ర హెచ్చు తగ్గులు

ముంబాయి: బంగారం ధర తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతోంది. బుధవారం రాత్రి 360 రూపాయల దాకా పడిన 10 గ్రాముల ధర గత రాత్రి మళ్లీ 374 రూపాయలకు పెరిగి 26,914 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే నష్టాన్ని పూర్తిగా  భర్తీ చేసుకుంది. బంగారం ధరలో ఇంతలా హెచ్చు తగ్గులు రావడానికి అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న  పరిణామాలే కారణం. గడిచిన రెండు రోజులుగా  ఔన్స్‌ ధర వేగంగా 1475 డాలర్ల నుంచి 1440 డాటర్లకు పడింది. మళ్లీ అంతలో తేరుకుని 1475 డాలర్లకు చేరుకుంది. క్రూడాయిల్‌ ధర 3 డాలర్ల దాకా పెరిగి 103 డాలర్లకు చేరడం బంగారంపై ప్రభావాన్ని చూపింది. యూరోపియిన్‌  సెంట్రల్‌ బ్యాంక్‌  వడ్డిరేట్లను 0.5 శాతం నుంచి 0.25శాతనికి తగ్గించింది. దీనివల్ల వ్యవస్థలో నిధుల ప్రవాహం పెరుగుతుందని.. అందులో కోంత డబ్బు బంగారంలోకి వస్తుందనే అంచనాతో కూడా ధర పెరుగింది. మన దేశంలో రూపాయి కొంత బలపడటం వల్ల బంగారం ధర తక్కువగా పెరుగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *