Tuesday, 3 November 2026

పాఠశాల బస్సును ఢీకొన్న లారీ: 11 మందికి గాయాలు

గుంటూరు,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని పటేల్‌నగర్‌ వద్ద శనివారం ఉదయం పాఠశాల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. బాపట్లలోని కేర్‌ పాఠశాలకు చెందిన బస్సు కర్లపాలెం, బాపట్ల మండలాలకు చెందిన విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40మంది విద్యార్థులు ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో ఉన్న విద్యార్థులను బయటకు తీసి 108 వాహనంలో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు జరిగిన ప్రమాదం తెలుసుకుని పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులకు వైద్యులు చికిత్స అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *