పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో నివసిస్తున్న కోళ్లఫారం యజమాని రమేష్‌రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రమేష్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లడం గమనించిన దుండగులు శనివారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించి సుమారు 300 గ్రాముల బంగారు, కిలో వెండి అభరణాలతో పాటు రూ. 77వేల నగదును అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




