Wednesday, 4 November 2026

పూర్తికావచ్చిన పీఎస్‌ఎల్‌వీ-సీ22 మొదటి దశ పనులు

నెల్లూరు : శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేన్‌ సెంటర్‌ (షార్‌) నుంచి జూన్‌లో నింగిలోకి పంపనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ22 సన్నాహక కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ప్రయోగం ద్వారా ఆర్‌ఎస్‌ఐఎస్‌ ఉపగ్రహన్ని నింగిలోకి పంపనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని శాటిలైట్‌ సెంటర్‌లో రూపొందించిన ఈ ఉపగ్రహనికి సంబంధించిన కొన్ని పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. దీని ద్వారా సముద్ర సంపదను గుర్తించే వీలుంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై పీఎస్‌ఎల్‌వీ-సీ 22 మొదటి దశ పనులు పూర్తి కావచ్చాయి. ఈ నెల 15 నుంచి రెండో దశ పనులు ప్రారంభమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *