ఏలూరు, జనంసాక్షి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని గజ్జెలవారి చెరువు ప్రాంతంలో రూ. 1.80 కోట్లతో అభివృద్ధి చేసిన బుద్ధుని పార్కును సీఎం కిరణ్ ప్రారంభించారు. 74 అడుగుల బుద్ధుడి విగ్రహాన్ని ఇందులో ప్రతిష్టించారు. పార్కును అభివృద్ధి చేయడానికి కృషి చేసిన అధికారులను సీఎం కిరణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాం రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు.




