Wednesday, 4 November 2026

పొలంలో నీటి పంపకాల్లో గొడవ…మరదలిపై బావ దాడి

 

చిత్తూరు, ఆగస్టు 24 : జిల్లాలోని పీలేరు మండలం అబ్బవరంలో దారుణం జరిగింది. పొలం తగాదా విషయంలో మరదలిపై బావ విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితురాలు అందించిన దృశ్యాల ఆధారంగా నిందితుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులు, ప్రమీల భార్యాభర్తలు. వారి పొలాల్లో నీటి పంకాల విషయంలో మరదలిపై స్వయానా బావా దాడి చేశాడు.
భర్త కళ్లముందే కాళ్లతో తంతూ దాడి చేశాడు. గతకొంతకాలంగా అన్నదమ్ముల మధ్య పొలం విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భార్యభర్తలు ఇద్దరూ శనివారం పొలం వద్ద ఉదయం నీళ్లు పారిస్తున్న సమయంలో దాయాది వర్గమైన నాగభూషణం, రామయ్య, అమర్నాథ్, నరహరి వీరంతా కలిసి ప్రమీలా ఆమె భర్తపై దాడి చేశారు. ఈ ఘటన దృశ్యాలను శ్రీనివాసులు కుమారుడు చంద్రశేఖర్ ఫోన్‌లో రికార్డు చేశాడు. అనంతరం ఈ వీడియోలను మదనపల్లి పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నలుగురిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *