Monday, 2 November 2026

పోలీసులపై తమిళకూలీల రాళ్ల దాడి

కడప,మార్చి31(జ‌నంసాక్షి): తమిళనాడుకు చెందిన ఎర్రకూలీలు మరోమారు తెగించారు. కూంబింగ్‌ చేస్తున్న పోలీసులపై ఆళ్లదాడికి దిగారు.  కడప జిల్లా రైల్వేకోడూరు మండలం వాజేటికోన అటవీ ప్రాంతంలో పోలీసులు ఈరోజు కూంబింగ్‌ నిర్వహించారు. దీంతో కొందరు తమిళకూలీలు వారిపై రాళ్లతో దాడి చేశారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేయగా… మిగిలిన వారు పరారయ్యారు. సంఘటనాస్థలం నుంచి 105 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన కూలీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *