Wednesday, 4 November 2026

ప్రజా వ్యతిరేక చర్యలు ప్రారంభించిన ఏపీ సర్కార్:పి.మధు

విశాఖ: బిజెపితో పొత్తు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీపీఎం ఏపీ ప్రధాన కార్యదర్శి పి. మధు ఆరోపించారు. సీపీఎం జాతీయ మహసభల ప్రారంభోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బిజెపి మతతత్వాన్ని విస్తరించేలా పని చేస్తోందని విమర్శించారు. విశాఖలో 21వ జాతీయ మహాసభలు జరుపుకోడం గర్వంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు ప్రారంభించింది. కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు రైతుల నుంచి భూములను సేకరిస్తోందని పేర్కొన్నారు. 15 లక్షల ఎకరాల సేకరణ చర్యలు మొదలు పెట్టిందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *