Wednesday, 4 November 2026

బీజేపీ ప్రభుత్వం బూర్జువా సంస్థలకు కొమ్ముకాస్తోంది:కరత్

విశాఖ: బిజెపి సర్కార్ బూర్జువా సంస్థలకు కొమ్ము కాస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ విమర్శించారు. విశాఖలో జరుగుతున్న సీపీఎం 21వ జాతీయ మహాసభల ప్రారంభ సభలో ఆయన ఉపన్యసించారు. మోదీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు వెన్నుదన్నుగా నిలుస్లూ… హిందూత్వ శక్తులను పెంచి పోషిస్తోందని పేర్కొన్నారు. దీని వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. 10 నెలల పాలనలో విలువైన ఖనిజ సంపదను మోదీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *