చిత్తూరు,ఫిబ్రవరి23(జనంసాక్షి ): రాష్టాన్రికి ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో కేంద్రంపై కాంగ్రెస్, వైకాపా నేతలు ఆరోపణలకు దిగడం దారుణమని భాజపా జిల్లా కార్యదర్శి గోపాలరెడ్డి అన్నారు. ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉంటూ హంద్రీ-నీవా కాలువ పనులను ఎందుకు పూర్తి చేయించలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు. కరవు పీడిత ప్రజలతో మాట్లాడి తక్షణం చేపట్టవలసిన ఉపశమన చర్యలపై నివేదికను ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కరవు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి వచ్చేనెల రెండునుంచి ఐదో తేదీ వరకు తమ పార్టీకి చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు రాయలసీమలో పర్యటించనున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావులతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ పర్యటనలో ఉంటారని తెలిపారు.రెండోతేదీన తిరుపతిలో మంత్రుల పర్యటన మొదలై చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనప్లలె వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. మూడో తేదీన కురబలకోట, తంబళ్లప్లలె, పెద్దమండ్యం మండలాల విూదుగా కడప జిల్లాలోకి మంత్రుల బృందం వెళ్తుందని పేర్కొన్నారు. నాలుగో తేదీన కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు తిరిగి హైదరాబాదుకు చేరుతారని వివరించారు.




