Wednesday, 4 November 2026

25న ఎమ్మెల్సీ అభ్యర్థి కృష్ణారావు నామినేషన్‌

కాకినాడ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): ఉపాధ్యాయ నియోజకవర్గానికి నామినేషన్ల పర్వం వేడెక్కింది. 24న కృష్ణారావు, 26న చైతన్యరాజులు తమ నామినేషన్లు వేయనున్నారు.ఈ మేరకు వారు తమేర్పాట్లను చేస్తున్నారు  గురువులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిసిన వాడిగా, నిజాయతీ, క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుడిగా తాను రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ పరుచూరి కృష్ణారావు చెప్పారు.  ఈనెల 25న పరుచూరి నామినేషన్‌ దాఖలు చేసే సందర్భంగా అన్ని సంఘాల నాయకులు, సభ్యులతో భారీ మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించాలని తీర్మానించారు. పలు సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృష్ణారావును కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వపరంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా, అందరికి అత్యుత్తమ విద్యా విధానం అందేలా శక్తివంచన లేకుండా పని చేస్తానన్నారు. ఈ సందర్భంగా పలు విద్యార్థి సంఘాలకు చెందిన ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ నాయకులు , పండిత పరిషత్‌ నాయకులు, ప్రైవేట్‌ పాఠశాలల అధ్యాపకుల సంఘం నాయకులు, జూనియర్‌ కళాశాలల యాజమాన్యం సంఘ నాయకులు, ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకుల సంఘ నాయకులు పాల్గొని రానున్న ఎన్నికల్లో నిర్వహించాల్సిన ప్రచార కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలు గురించి చర్చించారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రభుత్వ విప్‌ చైతన్యరాజు ఈనెల 26న నామినేషన్‌ వేయనున్నారు. ఈ మేరకు చైతన్యరాజు కార్యాలయం ఓ ప్రకటన వెలువడింది. ఆ రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ నాగమల్లి జంక్షన్‌లోని చితన్య కళాశాల ప్రాంగణం నుంచి చితన్యరాజు వూరేగింపుగా బయలుదేరతారు. ఆయనతోపాటు మద్దతిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు, తెదేపా నాయకులు ఊవూరేగింపులో పాల్గొంటారు. చితన్యరాజు నామినేషన్‌ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణణడు, మంత్రులు పీతల సుజాత, పైడికొడల మాణిక్యాలరావు, తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల జడ్పీ చైర్మన్లు నామన రాంబాబు, ముళ్లపూడి బాపిరాజు, ఉభయగోదావరి జిల్లాల తెదేపా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీ సభ్యులు హాజరవుతారని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *