అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరాశ, నిస్సృహల్లో ఉన్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ గోయల్ కమిటీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి దురుద్దేశపూర్వకంగానే నియమించారన్నారు. ఉద్యోగుల పీఆర్సీవూ ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఈ నెల 27,28 తేదీల్లో అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు గోపాల్ రెడ్డి తెలియజేశారు.




