Tuesday, 3 November 2026

ప్రియురాలిపై మోజు పడ్డాడని.. స్నేహితుడిని దారుణంగా చంపేశాడు

తాడిపత్రి: తన ప్రియురాలిపై మోజుపడ్డాడన్న ఆగ్రహంతో సూర్యమోహన్‌ను స్నేహితుడే హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణంలోని సీపీఐ కాలనీ చెందిన లింగమయ్య, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలూం శింగారం గ్రామానికి చెందిన సూర్యమోహన్‌లు స్నేహితులు. ఇరువురూ ఆళ్లగడ్డ ప్రాంతంలో కారు దొంగతనం కేసులో నిందితులుగా ఉన్నారు. లింగమయ్య ప్రియురాలు క్రిష్ణవేణిపై..  సూర్యమోహన్‌ మోజుపడి శారీరకంగా అనుభవించాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లింగమయ్య అతని స్నేహితుడు అవతార్‌తో కలసి నంద్యాలరోడ్డులో సూర్యమోహన్‌ను హత్య చేశారు.
ఇనుపరాడ్‌తో తలపై కొట్టి.. కత్తితో గొంతుకోసి.. వేటకొడవలితో మెడపై నరికి చంపారు. పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి వేటకొడవలి, రాడ్‌, కత్తి స్వాధీనం చేసుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *