కడప,మార్చి9(జనంసాక్షి): జిల్లాలో ఈనెల 9 నుంచి 15 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉధృతం చేయనున్నట్లు బిజెపి జిల్లా నాయకత్వం ప్రకటించింది. జిల్లాలో బిజెపిని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి తెలిపారు. ప్రజల విశ్వసనీయతకు దగ్గరవుతున్న పార్టీ బిజెపి అని అన్నారు. సభ్యత్వ నమోదు అనుకున్న స్థాయికంటె అధికంగా చేయడానికి అందరు సమాయత్తం కావాలని కార్యకర్తలతో అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపు మేరకు జిల్లాలో ఉన్న 2వేల మంది క్రియాశీలక సభ్యులు అనుకున్న స్థాయికంటె అధికంగా చేసేందుకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో , జిల్లా నాయకులు, వివిధ ప్రాంతాల క్రియాశీలక సభ్యులు కృషఙ చేయాలన్నారు. ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.




