ప్రేమ కోసం యువకుడి ఆత్మహత్య
విజయవాడ, : ప్రేమ విఫలంకావడంతో కృష్ణానదిలోకి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణలంక రణదేవనగర్‌కు చెందిన రమణ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చనిపోయేముందు రమణ సోదరుడు రాజుకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. రాజు వచ్చి చూసే సమయానికి అతని కళ్లెదుటే రమణ కృష్ణానదిలోకి దూకేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.