Monday, 2 November 2026

ప్లాట్‌ఫాంపై దూసుకుకెళ్లిన కర్ణాటక ఆర్టీసీ బస్సు

చిత్తూరు : చిత్తూరు ఆర్టీసీ నూతన బస్టాండ్‌లో ఏడో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి ఈరోజు ఉదయం బెంగుళూరు డిపోకు చెందిన కర్ణాటక ఆర్టీసీ బస్సు దూసుకువచ్చింది. కండక్టర్‌ రామ్‌కుమార్‌  బస్సు నడపవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రత్యక్షసాక్ష్యులు తెలిపారు. కండక్టర్‌కు డ్రైవింగ్‌ అనుభవం లేనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్లాట్‌ఫాం సమీపంలో ఉన్న ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి.బస్టాండ్‌లోని ఫర్నించర్‌ థ్వంసమైంది. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *