ప్రకాశం: మార్కాపురం కంభం రోడ్డులోని ప్లాస్టిక్ గోదాంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. రూ.10 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. షార్ట్‌సర్య్కూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.




